Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రం లైగర్. ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మళయాళ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక విజయ్ ఈ అపోహలన్నింటికీ తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ముగింపు ఇచ్చేసినట్లే అనిపిస్తోంది. ఈ మీడియా సమావేశంలో విజయ్ లైగర్ సినిమాపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ.. అందరూ ఈ చిత్రాన్ని గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకి రీమేక్ అంటున్నారని, కానీ కచ్చితంగా అలా జరిగే అవకాశమే లేదని అన్నారు.
అంతే కాకుండా ఆ సినిమా అంటే తనకి ఇష్టమని, ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే దానికి అన్నీ కుదిరితేనే అది సాధ్యమవుతుందని తెలిపాడు. కానీ తాను రీమేక్ ల జోలికి వెళ్లే వ్యక్తిని కాదని, అవి తనకు ఏమాత్రం సరిపడవని తన అభిప్రాయాన్ని వివరించాడు. అయితే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న సినిమా అనీ, ఇక లైగర్ మూవీ అందరూ అనుకుంటున్నట్లుగా బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన చిత్రం కాదని అది మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ పై రూపొందించిన సినిమా అని వివరించారు.
దీంతో విజయ్ ఈ చిత్ర కథపై నడుస్తున్న పుకార్లన్నింటికీ చెక్ పెట్టేసినట్లు అయ్యింది. ఇది పూర్తిగా కొత్త కథ అని.. ఏ సినిమాకి కూడా అనువాదం కాదని చెప్పకనే చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇక లైగర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…