Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసిందని చెప్పవచ్చు. కొన్ని సార్లు దర్శక నిర్మాతలు సినిమా కథాంశాన్ని హైలెట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశలయ్యాయి.
లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారిరు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.90 కోట్లు రాబడుతుందని లెక్కలు వేసుకుంటే రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ. 70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాలనుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతలను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.
హీరో విజయ్ దేవరకొండకు నిర్మాతలు లైగర్ చిత్రానికిగాను రూ.15 కోట్లు పారితోషికం కింద ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆశించిన మేరకు ఫలితం సాధించకపోవడంతో నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని అర్థం చేసుకున్నాడు విజయ్. తనకు ఇచ్చిన పారితోషికంలో రూ.6 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ విశాల హృదయానికి అందరు ఫిదా అవుతున్నారు. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకొని విజయ్ దేవరకొండ పారితోషకం లో సగభాగం ఇచ్చేయడంతో అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు.
విజయ్ గత సినిమాలతో పోలిస్తే లైగర్ సినిమా కనీసం వాటి అంచనాలు కూడా చేరలేకపోయింది. విజయ్ దేవరకొండ సినిమాకు పెద్ద అండ అని అందరు అనుకున్నా అది కలగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో ఎదురైన చేదు అనుభవం పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రం మీద పడకుండా పూరీ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…