Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను నటించిన తొలి హిందీ ఫిల్మ్ గుడ్ బై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజా ఈవెంట్ లో రష్మిక మందన్న ఎంట్రీ అదిరిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో ఈ స్టార్ హీరోయిన్ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ప్రింటెడ్ లెహంగా, వోణీ ధరించిన రష్మిక నాజూకు అందాలను విందు చేసింది. తన ప్రజెన్స్ తో ఈవెంట్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.
రష్మికని చూసిన ఆమె అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారికి సెల్ఫీలు ఇస్తూ సరదాగా ముచ్చటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇటీవల సీతారామం మూవీలో ఒక కీలక రోల్ చేసి మంచి పేరు అందుకున్న రష్మిక, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కి కూతురుగా గుడ్ బై మూవీలో కనిపించనుండగా వికాస్ బాల్ దీనిని తెరకెక్కించారు. కామెడీతో కూడిన ఎమోషనల్ డ్రామా మూవీగా తెరకెక్కిన గుడ్ బై అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రష్మిక.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…