Vidya Balan : బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో ఈమె నటించి అలరించింది. సినిమాలో పాత్ర ఏదైనా సరే అందులో ఈమె జీవిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. అనేక భాషలకు చెందిన మూవీల్లో ఈమె నటించింది.

ఒకప్పుడు విద్యా బాలన్ గ్లామర్ షోకు మారుపేరుగా ఉండేది. ఈమె అందాల ఆరబోతకు బాలీవుడ్‌లో ఇతర తారలు తట్టుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఈమెకు వయస్సు పెరిగింది. 43 ఏళ్ల వయస్సు ఉన్నా.. ఈమె గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఫొటోషూట్‌లు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విద్యా బాలన్ షేర్ చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు హీట్ పెంచుతున్నాయి. కుర్రకారు మతులను పోగొడుతున్నాయి.
Vidya Balan : అందాలను ఆరబోయడంలో తగ్గేదేలే..
లేటు వయస్సులోనూ ఈమె అందాలను ఆరబోయడంలో తగ్గేదేలే.. అంటోంది. విద్యాబాలన్ వాస్తవానికి గొప్ప నటి అని చెప్పవచ్చు. పలు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఈమెకు గ్లామర్ షో చేయడం కొత్తేమీ కాదు కానీ.. ఈ వయస్సులో ఇంతలా రెచ్చిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక విద్యాబాలన్ చివరిసారిగా షెర్ని అనే చిత్రంలో నటించింది. అందులో అడవిలో మృగాలను వేటాడే పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఈమె నటిస్తున్న జల్సా చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరో మూవీలోనూ ఈమె నటిస్తోంది.