Vidya Balan : బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతున్న వారిలో నటి విద్యాబాలన్ ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా విద్యాబాలన్ నటించిన జల్సా సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలియజేశారు.

కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపారు. కెరియర్ మొదట్లో తనని ఎంతో మంది నిర్మాతలు వారి సినిమాలలో రిజెక్ట్ చేశారని, అయితే ప్రస్తుతం ఆ నిర్మాతలు తనకు ఫోన్ చేసి తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారని తెలిపారు. ఇక తనని సుమారు 13 సినిమాల నుంచి రిజెక్ట్ చేశారని ఈ సందర్భంగా విద్యాబాలన్ తెలియజేశారు.
ఇక ఒక నిర్మాత అయితే తనతో చాలా నీచంగా ప్రవర్తించాడని అతని ప్రవర్తన కారణంగా ఇండస్ట్రీపై తనకు చెడు భావన ఏర్పడిందని విద్యాబాలన్ వెల్లడించారు. ఆయన చేసిన దుర్మార్గపు పని వల్ల ఆరు నెలల పాటు తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడలేకయానని ఈ సందర్భంగా విద్యాబాలన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇలా కెరీర్ మొదట్లో ఎన్నో చేదు సంఘటనలను ఎదుర్కొని తన పని తాను చేసుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలా నిలబడ్డానని విద్యాబాలన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.