Venu Swamy : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని.. కుదిరితే దానికి నేనే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య అన్నాడు.
కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి, కొరటాల, రాజమౌళి పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞలో హీరోకి ఉండాల్సిన లుక్ కనిపించడం లేదు. దీంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. సెలెబ్రిటీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇస్తారని వేణుస్వామి అన్నారు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని జాతకం చెప్పారు.

మోక్షజ్ఞ జాతకం ప్రకారం సినీరంగంలో, కళారంగంలో అతడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. నందమూరి వారసుడు అంటే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. రాజకీయాల విషయానికి వస్తే మోక్షజ్ఞకి పాలిటిక్స్ సాధ్యం కాదు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు మాత్రం ముందు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చాలు.. రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు. వేణుస్వామి ఇంతకు ముందు నాగ చైతన్య, సమంత విడాకుల విషయం, అలాగే జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉందని కూడా చెప్పారు.