Venu Swamy : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. అయితే విజయ్ ఈ రెండు చిత్రాలు తప్ప మిగతా మూవీస్ పెద్దగా హిట్ అవ్వలేదు. తాజాగా విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ విజయ్ కెరీర్ లో బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచిందని సినీ ప్రముఖులు తెలుపుతున్న విషయం తెలిసిందే.
లైగర్ కు ముందు వచ్చిన 4 చిత్రాలు కూడా ఫ్లాఫ్ అయ్యాయి. విజయ్ కెరీర్ లో దెబ్బ మీద దెబ్బ పడటానికి కారణాలు ఏంటో తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపారు. విజయ్ కి అష్టమి నడుస్తోందన్నారు. ఆయన జాతకం ప్రకారం.. అష్టమ శని ప్రారంభం అవ్వడంతో లైగర్ కు ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యిందన్నారు. ఇంకొన్నాళ్లు ఈ ప్రభావం ఉంటుందన్నారు.

కెరీర్ పరంగా చూస్తే మరో రెండు, మూడు చిత్రాలు సానుకూల ఫలితాలనిచ్చినా.. మున్ముందు విజయ్ కి కష్టమేనన్నారు. గతంలో సమంత, నాగ చైతన్యల విడాకులపై వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు అక్షర సత్యం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ జాతకంపై కామెంట్స్ చేయడం విజయ్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తుంది. ఇక విజయ్ సమంత కలిసి నటిస్తున్న ఖుషి మూవీ డిసెంబర్ లో విడుదల కానుంది. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.