Venu Swamy : ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సెలబ్రెటీల జాతకాల గురించి చెప్తూ ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన మాటలను ఎవరు పట్టించుకొంటారు అనే సమయంలో ఆయన చెప్పినట్లుగానే సమంత- చైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి మాటలను అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అయితే నయనతార విషయంలో వేణుస్వామి చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజమవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత నయనతార సంసార జీవితం సాఫీగా సాగదని గురువు నీచ స్థితిలో ఉండటమే ఇందుకు కారణమని వేణుస్వామి గతంలో చెప్పుకొచ్చారు.
నయనతార పెళ్లి తర్వాత ఆమె వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని నయన్ విఘ్నేష్ విడిపోతారని ఆయన తెలిపారు. అయితే ఆయన చెప్పిన విధంగానే పెళ్లి తర్వాత నయన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. నయన్ తన పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వడంపై గతంలో నెగిటివ్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. తిరుమలలో చెప్పులు ధరించి నయన్ ఫోటోషూట్ లో పాల్గొనడం వివాదాస్పదమైంది. తాజాగా నయన్ సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో వివాదంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నయనతార పిల్లల్ని కన్నారని చట్టం చెబుతోంది.

అయితే విఘ్నేష్ దీనిపై స్పందిస్తూ.. సరైన సమయంలో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి, అప్పటి వరకూ ఓపికతో ఉండండి, ఎల్లప్పూడూ కృతజ్ఞతతో ఉండండి అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. నయన్ విఘ్నేష్ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నయనతార ఈ వివాదం నుంచి త్వరగా బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార రాబోయే రోజుల్లో అయినా వివాదాలకు దూరంగా ఉంటుందేమో చూడాలి..