Venkatesh Son Arjun : సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం అని చెప్పవచ్చు. బాలీవుడ్ టు టాలీవుడ్ ఎందరో హీరోహీరోయిన్ల పిల్లలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటీనటులే వారసులు మాత్రమే కాకుండా దర్శక నిర్మాతల వారసులు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి వారి వారసుడిగా వెంకటేష్ కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
1986లో కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ మొదటి నుంచి ఎంతో డీసెంట్ గా ఉండే వ్యక్తి. ఎప్పుడూ ఎలాంటి వివాదాలలోనూ ఆయన పేరు వినిపించదు. ఆయన వ్యక్తిగత విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ బయటకు వినిపించవు.
వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్. వెంకటేష్ భార్య నీరజ కూడా చాలా తక్కువగా బయట కనిపిస్తారు. వెంకటేష్ కుటుంబంలో అందరూ కలిసి కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈవెంట్స్‌లలో దగ్గుబాటి అర్జున్ కనిపించాడు. ఆ సమయంలో అర్జున్ చాలా చిన్నవాడు. ఇటీవలే అన్నయ్య రానా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోస్ లో మరోసారి కనిపించాడు అర్జున్. ప్రస్తుతం అర్జున్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననాయి. గతంలో అర్జున్‌ని చూసిన వాళ్లు ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. ఐదేళ్లలోనే చాలా మారిపోయాడు అర్జున్ దగ్గుబాటి.
నూనూగు మీసాలతో, ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డంతో, ఆరడుగుల హ్యాండ్సమ్ లుక్ లో అర్జున్ ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అర్జున్ ని చూస్తుంటే రెండు మూడేళ్లలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు అర్జున్ జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అర్జున్ చదువు పూర్తవుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని టాలీవుడ్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…