Super Star Krishna : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో కృష్ణ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం ఏదో తెలుసా..?

Super Star Krishna : అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు నలుగురు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా ఉండేవారు. వీరి చిత్రాలు విడుదల అయ్యాయంటే చాలు ప్రేక్షకులకు పండుగలాగా ఉండేది. ఏడాదికి పది చిత్రాలతో ఈ హీరోలు ప్రేక్షకులను అలరించి మెప్పించేవారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో కూడా ఎన్నో ఘనవిజయాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించేవి.

20 ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపుగా 350 చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆ రోజుల్లో కృష్ణ ఒకే సంవత్సరంలో 18 చిత్రాలలో నటించిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఉండేది సూపర్ స్టార్  కృష్ణ కమిట్‌మెంట్‌. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో అల్లూరి సీతారామరాజు చిత్రం కూడా ఒకటి అని చెప్పవచ్చు.

Super Star Krishna

అప్పట్లో రిలీజైన ఈ చిత్రం ఎన్నో రికార్డులను బద్దలు చేస్తూ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. ఈ చిత్రానికి రామచంద్ర రావు దర్శకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగువీర లేవరా అనే పాట ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉంటుంది. రామచంద్ర రావు దర్శకత్వం వహించిన అసాధ్యుడులో కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేయడం జరిగింది. అయితే రామచంద్రరావు మొదటిగా ఈ అల్లూరి సీతారామరాజు చరిత్ర కథ ఎన్టీఆర్ కి వినిపించడం జరిగింది.

కానీ కొన్ని కారణాల వలన ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రను రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు రామచంద్రరావుకి అసాధ్యుడు చిత్రంలో కృష్ణ వేసుకున్న అల్లూరి సీతారామరాజు వేషం గుర్తుకు రావడంతో ఈ కథను సూపర్ స్టార్ కృష్ణకి వినిపించడం జరిగింది. ఆయనకు ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. కృష్ణ అల్లూరి సీతారామ రాజు చిత్రం 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రం పనులు జరుగుతూ ఉండగానే అకస్మాత్తుగా రామచంద్రరావు మరణించారు.

మిగతా చిత్రాన్ని కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. కృష్ణ సొంత బ్యానర్ అయిన పద్మాలయా స్టూడియోస్ సారథ్యంలోనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షోతోనే మంచి టాక్ వినిపించడంతో బాక్సాఫీస్  వద్ద ఘన విజయాన్ని సాధించింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM