Venkatesh Family : టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విక్టరీ వెంకటేష్. కెరీర్ ప్రారంభం నుండి కుటుంబ కథా చిత్రాలతో వెంకటేష్ ఆకట్టుకోవడంతో ఆయనకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3తో వెంకటేష్ ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను దక్కించుకుంది. వెంకటేష్ ప్రస్తుతం రానా తో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు సినీ ఫంక్షన్స్ గాని, బయట వేరే ఫంక్షన్ గాని తీసుకురారు. అసలు చాలా మందికి వెంకటేష్ ఫ్యామిలీ గురించి తెలియదు. వెంకటేష్ భార్య పేరు నీరజ. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు అశ్రిత కాగా రెండవ కూతురు పేరు హయవాహిని, చిన్న కూతురు భావన. ఇక వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్ రామనాధ్.

ఈ నలుగురిలో వెంకటేష్ పెద్దకూతురు అశ్రితకు హీరోయిన్ ల రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆమె ఫాలోవర్స్ లో చాలామందికి అశ్రిత వెంకటేష్ కూతురు అని తెలియదు. అశ్రిత హీరో కూతురుగా కాకుండా ఫుడ్ వ్లాగ్ లు, ఫుడ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సంపాచిందించుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి రెస్టారెంట్ లను నిర్వహిస్తోంది.
ఇక రెండో కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరుకుని ఆ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆమె చేసిన చాలా డిజైన్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తున్నాయట. మూడో కూతురు భావన తన డిగ్రీ చదువు పూర్తి చేసుకుని క్రీడారంగం వైపుగా అడుగులు వేస్తుంది. దగ్గుపాటి వారసుడు అర్జున్ కూడా స్టడీస్ పై పూర్తి దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాడు. అర్జున్ చదువు పూర్తయిన తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చేదని చాలా ఇంటర్వ్యూలో వెంకటేష్ క్లారిటీగా చెప్పేశారు.