Vastu Tips : సాధారణంగా మనలో చాలా మందికి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో డబ్బు సమస్య ఒకటి. కొందరికి కొంతకాలంపాటు మాత్రమే డబ్బు సమస్య ఉంటుంది. కానీ కొందరిని మాత్రం ఈ సమస్య జీవితాంతం వెంటాడుతుంటుంది. ఏం చేసినా కలసి రాదు. సంపాదించిన డబ్బు అంతా ఏదో ఒక విధంగా వృథా ఖర్చు అవుతుంటుంది. చేతిలో డబ్బు నిలవదు. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి స్థితి వస్తే ఏం చేయాలో అర్థం కాదు. అయితే చాలా వరకు ఇలాంటి పరిస్థితులు రావడానికి ఇంట్లోవాస్తు దోషాలే కారణమవుతుంటాయి. దీంతోపాటు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నా.. ఇలాగే జరుగుతుంది. కనుక వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. ఇక అందుకు మనీ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు ప్రకారం అనేక సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది. దీంతో ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది ఇంట్లోని వారి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అది నిజమే. అయితే దీన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఒక నిర్దిష్టమైన దిక్కులో మాత్రమే మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. లేదంటే ఫలితాలు రావు.
ఇక మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. తూర్పుకు, దక్షిణానికి మధ్య ఉండే దిక్కులో ఈ మొక్కను ఉంచాలి. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈ దిక్కున మనీ ప్లాంట్‌ను పెట్టడం వల్ల అక్కడ ఉండే వినాయకుడు మనకు శుభాలను అందిస్తాడు. ఎలాంటి విఘ్నాలు రాకుండా చూస్తాడు. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తవుతుంది.అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ దిక్కుకు శుక్రాచార్యుడు అధిపతి. కనుక మనపై చెడు దృష్టి లేదా దిష్టి ప్రభావం ఉండదు. దీంతోపాటు ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ధనం బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. కనుక ఈ దిక్కున మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచితే ఎంతో మేలు జరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…