Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో చాలా మంది అందులో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పలు పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. తమ డ్యాన్స్ లకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. గతంలో టిక్‌టాక్ యాప్ ఉన్నప్పుడు ఎలాగైతే చాలా మంది వీడియోలను పోస్ట్ చేసేవారో.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అలాగే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా ఓ ఫ్లైట్ అటెండెంట్ కూడా అలాగే ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
స్పైస్ జెట్ అనే విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తాజాగా మై సే మినా సే నా సఖి సే.. అనే హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. స్పైస్ జెట్‌కు చెందిన ఖాళీగా ఉన్న విమానంలో ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ పాట 1987లో విడుదలైన నటుడు గోవిందా నటించిన ఖుద్‌గర్జ్ చిత్రంలోనిది. ఆ పాటకే ఆమె అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా ఉమా మీనాక్షి షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 65వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తుంటుంది. అలా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.71 లక్షలకు పైగా ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…