Varun Tej : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ప్రత్యేకమైన, విభిన్నమైన చిత్రాలను తీస్తూ దూసుకుపోతున్నాడు. అగ్ర హీరోగా ఎదిగేందుకు కావల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ సినిమాలు తీయడం వరకు బాగానే ఉంది, కానీ వాటిని రిలీజ్ చేసే తేదీలే ఇతర మెగా హీరోలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అంటున్నారు.
వరుణ్ తేజ్ తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ మూవీలతో మంచి హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే గని సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అయితే అంతకు వారం ముందు.. అంటే.. డిసెంబర్ 17వ తేదీన పుష్ప వస్తోంది. ఇలా వారం రోజుల తేడాతో ఇద్దరు మెగా హీరోల సినిమాలు రానున్నాయి.
ఈ విధంగా సినిమాలు రావడం వల్ల ఇద్దరికీ ఇబ్బందే అని విశ్లేషకులు అంటున్నారు. మెగా హీరోలు కనుక ఒక హీరో సినిమా వచ్చాక కనీసం నెల రోజులు అయినా ఆగితే బాగుంటుందని, కానీ వారం వ్యవధిలో మూవీలు అంటే.. రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అంటున్నారు. దీంతో వరుణ్ తేజ్ తోటి మెగాహీరోలకే పోటీ వచ్చి వారికి తలనొప్పిగా మారుతున్నాడని.. ఆయన తన సినిమాలను ఇతర మెగా హీరోల సినిమాల తేదీలతో పోల్చి చూసి విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారు.
అయితే వాస్తవానికి మెగా హీరోలు అని కాదు, సినిమాలు బాగుంటే.. ఎప్పుడు విడుదల చేసినా హిట్టే అవుతాయి. దానికి తేదీలతో పనిలేదు. సినిమాలు ప్రేక్షకులను అలరించాలి.. అంతే..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…