Valtheru Veerayya : గాడ్‌ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో భారీ హిట్ సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తర్వాతి ప్రాజెక్టుగా డైరెక్టర్ బాబీ (కే.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో నటించనున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా టైటిల్ టీజర్, మెగాస్టార్ ఫస్ట్ లుక్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 24న విడుదల చేశారు. ఈ టీజర్‌తో మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చేశారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వింటేజ్ చిరుని బాబీ ప్రజంట్ చేశాడు.
ఇదిలావుండగా వాల్తేరు వీరయ్య స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. కథ ఇదేనంటూ టాలీవుడ్ లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారట. అయితే వీరు ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు తల్లుల కొడుకులు అట. సవతి తల్లుల పిల్లలైన చిరంజీవి, రవితేజ మధ్య ఆధిపత్యపోరు ఉంటుందట. ముఖ్యంగా రవితేజకు అన్నయ్య అంటే పడదట. ఒకపక్క శత్రువులను ఎదురిస్తూనే.. అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ సాగుతుందట. అది సినిమాకు హైలెట్ కానుందని టాలీవుడ్ వర్గాల వాదన.

ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ, ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తున్నాయి. గతంలో రవితేజ అన్నయ్య మూవీలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకడిగా ఆయన కనిపించారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నయ్య మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ కలిసొచ్చినా వాల్తేరు వీరయ్య సినిమాకు ప్లస్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న వాల్తేరు వీరయ్య కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.