Urfi Javed : బాలీవుడ్ నటి, బిగ్ బాస్ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈమె ధరించే దుస్తులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈమె ధరించే దుస్తులు అదోరకంగా ఉంటాయి. అలాగే అందాలను ఆరబోసేలా ఉంటాయి. దీంతో ఈమెను నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక గతంలో ఒక సమయంలో పవిత్రమైన పండుగ రోజు చుడీదార్ ధరించింది. కానీ ఎద అందాలు కనిపించేలా ఫొటోలకు పోజులు ఇచ్చింది. దీంతో ఈమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఉర్ఫి జావేద్ తన గురించి వచ్చే ట్రోల్స్‌ను ఏమాత్రం పట్టించుకోదు.
బాలీవుడ్‌లో ఎలాగైనా సరే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని చూస్తున్న ఉర్ఫి జావేద్ ఎప్పటికప్పుడు గ్లామరస్ దుస్తులను ధరించి అందాలను ఆరబోస్తుంటుంది. దీంతో ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక లేటెస్ట్‌గా ఆమె ధరించిన గ్రీన్ కలర్ డ్రెస్ తాలూకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎద అందాలను కప్పి ఉంచుతూ పొడుగ్గా ఉన్న ఈ డ్రెస్‌ను చూసిన నెటిజన్లు ఖంగు తింటున్నారు. ఇలాంటి డ్రెస్‌ను కూడా ధరించవచ్చా.. అని ఆశ్చర్యపోతున్నారు.

ఉర్ఫి జావేద్ వాస్తవానికి ఇలాంటి దుస్తులను ధరించడం కొత్తేమీ కాదు. గతంలో ఆమె ప్యాంట్ వేసుకోకుండా కేవలం షర్ట్ మాత్రమే ధరించి కూరగాయలు కొనేందుకు బయటకు వచ్చింది. అయితే అక్కడే కాపు కాచిన ఫొటోగ్రాఫర్లు ఆమె వెంటబడ్డారు. తాను ప్యాంట్ వేసుకోలేదని.. ఇప్పుడు ఫొటోలు వద్దని ఆమె చెప్పినా వినలేదు. దీంతో ఆమె పరుగు లంకించుకుంది. ఇలా ఉర్ఫి జావెద్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram