Upasana : కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్ మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరిస్తుంది మంచు లక్ష్మి. అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సాధించలేదు మంచు వారసురాలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. వెండితెరకు కొన్నాళ్లు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు నటనలో జోరు పెంచింది. లేచింది మహిళా లోకం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది.
మరోవైపు చెఫ్ మంత్రా అంటూ ఆహాలో ఒక కుకింగ్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. ఇలా మంచు లక్ష్మి కెరీర్‌లో చాలా బిజీగా ఉంటోంది. ఈరోజు (అక్టోబర్ 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన కూడా మంచు లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఉపాసన, రామ్ చరణ్, మంచు లక్ష్మి కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ హ్యాపీ రాక్ స్టార్ అంటూ కోట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆ పిక్‌లో ముగ్గురూ రాక్‌స్టార్‌ల తరహాలో ఎంతో స్టైల్‌గా, స్వాగ్ తో ఉన్నారు. మంచు లక్ష్మి టాలీవుడ్‌లో చాలామందితో క్లోజ్‌గా ఉంటుంది. వారిలో మెగా కోడలు, రామ్ చరణ్ ముందుంటారు. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మంచు లక్ష్మికి బర్త్ డే విషెస్ చెప్పింది. నా సోల్ సిస్టర్‌కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వాళ్లిద్దరూ కలిసున్న ఫొటోని షేర్ చేసింది. రకుల్, లక్ష్మి ఎంత క్లోజో సోషల్ మీడియాలో వారిని ఫాలో అయ్యే అందరికీ తెలిసిందే.