Upasana Konidela : కొణిదెల వారి ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉపాసన అనగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా రంగంతో ఎక్కువ టచ్ లేకపోయినా సినీ అభిమానులకు, భర్తకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ మెగా ఫాన్స్ తో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన వీలు తోచినప్పుడల్లా సామజిక కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఉపాసన చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ఉపాసన తాజాగా మరోసారి ఇంకో పనికి శ్రీకారం చుట్టి తన మంచి మనసు చాటుకున్నారు. మెట్టినింటిలోనే కాకుండా సమాజంలో కూడా ఉపాసనకు ఎంతో మంచి పేరు ఉంది.
లక్ష్మణ్ అనే వ్యక్తి ఉపాసన ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఓసారి మాటల సందర్భంలో బస్తీ పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి రెడీగా ఉన్నానని ఉపాసన అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే మాట మీద నిలబడ్డారని, అపోలో ఫౌండేషన్ ద్వారా త్వరలో స్కూల్ కట్టించబోతున్నారు అమ్మ గారు అని లక్ష్మణ్ చెబుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.
తాజాగా ఆ బస్తీలో జరిగిన వినాయక చవితి వేడుకకు అతిథిగా వచ్చారు ఉపాసన. లక్ష్మణ్ మా ఇంటిలో ముఖ్యమైన వ్యక్తి. అతనికి కావలసిన సహాయం అందించడంలో నేను ఎప్పుడూ ముందే ఉంటాను అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బస్తీలో కట్టబోయే స్కూల్ గురించి కూడా ఉపాసన మీడియాతో సంభాషించారు. ఉపాసన ఎంత అందంగా ఉంటారో ఆమె మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరోసారి చాటి చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…