Liger Movie : పూరీ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రంపై రిలీజ్ కి ముందు ఎన్నో భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు అందరి అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వినిపించడంతో ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. మొదటి రోజే సినిమా వారం రోజుల కన్నా ఎక్కువ ఆడదు అంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
రూ.120 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఈ చిత్రానికి సగం పెట్టుబడి కూడా సంపాదించలేకపోయింది. పెట్టుబడి పెట్టిన నిర్మాతలను పూర్తిగా నష్టాల వలయంలో నెట్టేసింది. లైగర్ సినిమా రిజల్ట్ దెబ్బకు విజయ్ దేవరకొండ షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఇంతటి డిజాస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఈ సినిమా 8 రోజులలో కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం. సీడెడ్ రూ.1.93 కోట్లు, నైజాం రూ.5.89 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.84 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.0.98 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.0.98 కోట్లు, కృష్ణా రూ.0.92 కోట్లు, గుంటూరు రూ.1.08 కోట్లు, నెల్లూరు రూ.0.73 కోట్లు రాబట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో మొత్తం కలుపుకొని 8 రోజులలో కలెక్షన్స్ కు గాను లైగర్ రూ.14.35 కోట్ల షేర్, రూ.28.71 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజులలో కలెక్షన్స్ కు గాను లైగర్ రూ.26.19 కోట్లు షేర్, రూ.52.38 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ రూ.55 కోట్లు వరకు జరిగింది. కానీ 8 రోజులలో వచ్చిన కలెక్షన్స్ ను బట్టి ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే ఈ సినిమాకి దాదాపు రూ.35 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. చిత్రం ఇలాంటి రిజల్ట్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. మరోవైపు లైగర్ ఫ్లాప్ టాక్ ను ప్రేక్షకులు త్వరగా మర్చిపోవడానికి విజయ్ దేవరకొండ టీమ్ కొత్త ఐడియాలు ఆలోచిస్తోంది.
ఇందులో భాగంగా ఫేక్ కలెక్షన్స్ ను పెట్టి సోషల్ మీడియాలో భారీ కలెక్షన్స్ అంటూ పెయిడ్ ప్రమోషన్స్ తో ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో ఈ తరహా ప్రమోషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా లేని లెక్కలు చూపించే కన్నా.. ముందు నుంచే కథపరంగా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. విజయ్ దేవరకొండ కూడా లైగర్ చిత్రానికి వచ్చిన రిజల్ట్ తో పూరీ మరో ప్రాజెక్ట్ అయిన జనగణమన చిత్రాన్ని ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…