Unstoppable With NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ టాక్ షో పై పెద్దఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ టాక్ షో ప్రసారం కానుంది. ఇందులో భాగంగానే టాక్ షో మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ప్రోమో ప్రకారం ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు రానున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, ఆయన పిల్లలు మంచు లక్ష్మి, మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారి రికార్డులను బద్దలు చేస్తోంది. దీంతో బాలయ్యా.. మజాకా.. అని ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
https://twitter.com/vamsikaka/status/1454722791555534849
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో కి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇక మొదటి ప్రోమోలో భాగంగా బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
సినిమాల పరంగా, రాజకీయ పరంగా ముఖాముఖి ప్రశ్నలు ఒకరినొకరు అడిగారు. దీంతో ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ప్రోమో విడుదలైన రెండు గంటలలోనే వన్ మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడంతో రికార్డులు సృష్టించిందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేవలం ప్రోమోకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ఈ టాక్ షో పై మరిన్ని అంచనాలు పెరిగాయి.