Unstoppable With NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ వెండి తెరపై హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై స్టార్ డమ్ సంపాదించుకున్న బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ కార్యక్రమం గురించి ఎంతగానో ఎదురుచూశారు. బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ఈ టాక్ షోను ఎలా నడిపిస్తారోనని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు మొదటి అతిథిగా రావడంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆహాకు సబ్‌స్క్రైబర్లు కూడా పెరిగి పోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం అద్భుతమైన రికార్డులను సృష్టించిందని చెప్పవచ్చు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఏకంగా 4 మిలియన్లకు పైగా లైక్‌లతో ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు 4 మిలియన్ లకు పైగా లైక్ లు, వ్యూస్‌తో టాప్ ప్లేస్ లో ఈ కార్యక్రమం నిలవడం గమనార్హం. అయితే ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమం కేవలం రెండు ఎపిసోడ్ లు మాత్రమే ప్రసారమైంది. బాలకృష్ణ చేతికి గాయం కావడం వల్ల కొన్ని వారాల పాటు వాయిదా పడింది. అయితే తిరిగి ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రోమోని వదిలారు. త్వరలో రానున్న ఎపిసోడ్‌లో బ్రహ్మానందం సందడి చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…