Abbavaram Kiran : ఈ మధ్య సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మృతిని మరచిపోక ముందే మరొకరు కన్ను మూస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. దీన్నుంచి తేరుకోకముందే ఓ యంగ్ హీరో ఇంట్లో విషాదం నెలకొంది.
యువ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఇక అబ్బవరం కిరణ్ .. ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రంతో ప్రేక్షకులని పలకరించి అలరించిన విషయం తెలిసిందే.
రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం.. చిత్రాలతో మెప్పించిన కిరణ్.. ప్రస్తుతం..సమ్మతమే, సెబాస్టియన్ పీసీ 524.. సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే కిరణ్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రమేశ్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా మరో దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ మలినేని గోపీచంద్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…