Samantha Naga Chaithanya : ప్రస్తుతం సమంత నాగ చైతన్యల విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు. అంటూ వచ్చిన వార్తలను ఎట్టకేలకు ఈ జంట నిజమని తెలుపుతూ అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై నాగచైతన్య స్పందిస్తూ విడాకులు తీసుకోబోతున్నామని అధికారిక ప్రకటన చేశారు.
ఇకపోతే ఏం మాయ చేశావే సినిమా ద్వారా మొట్టమొదటిసారి తెరపై సందడి చేసిన వీరు ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి చిత్రాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం 2017లో పెళ్లి బంధంతో ఒకటవడం జరిగింది. ఇదిలా ఉండగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ వెకేషన్ కి వెళ్లే వీరు చివరిసారిగా సమంత సామ్ జామ్ అనే కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా కనిపించారు.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎడబాటు కనిపించింది. సమంత ఒంటరిగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లడం, తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ ఆ వేడుకలలో పాల్గొనకపోవడం, చైతు లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో లేకపోవడం.. అభిమానులలో మరిన్ని సందేహాలకు కారణమయ్యాయి.
ఈ విధంగా వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో రాజీ అనే పాత్రలో ఎంతో బోల్డ్ గా నటించిన సమంత ఈ సిరీస్ ద్వారా అక్కినేని కుటుంబంతో తనకు మనస్పర్థలు వచ్చాయని.. అందుకే విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ నేడు నాగచైతన్య అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే వీరి విడాకుల్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చివరి వరకు వీరిని కలిపి ఉంచేందుకు యత్నించినా ఆ ప్రయత్నం విఫలమైందని సమాచారం. అందువల్లే ఇక విడాకులు తప్పదని భావించి వీరు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారని తెలుస్తోంది. అయితే సమంత దూరమైంది కనుక వీరి విడాకులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…