Orange Farming : వాహ్‌.. ఉన్న‌త చ‌దువులు చదివినా.. నారింజ‌ల‌ను పండిస్తూ కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు..

Orange Farming : మ‌న‌స్సు ఉండాలే గానీ మార్గ‌ముంటుంది. బాగా చ‌దువుకున్న వారు త‌మ చ‌దువుకు త‌గిన ఉద్యోగం చేసే డ‌బ్బులు సంపాదించాల‌ని ఏమీ లేదు. స‌రిగ్గా చేయాలే కానీ.. వ్య‌వ‌సాయం చేస్తూ కూడా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. రూ.కోట్ల‌ను గ‌డించ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ సోద‌రులు కూడా అదే చేశారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి వారు 7 ఏళ్ల కింద‌ట ఏర్పాటు చేసిన నారింజ తోట ఇప్పుడు సిరులు కురిపిస్తోంది. దాంతో వారు ఏటా రూ.కోట్ల‌లో సంపాదిస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి జిల్లాకు చెందిన ఉమేక‌ర్ సోద‌రులు అంటే చాలా ఫేమ‌స్‌. వారి నారింజ‌ల‌కు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్ప‌డింది. గోపాల్ ఉమేక‌ర్‌, స్వ‌ప్నిల్ ఉమేక‌ర్ అనే ఇద్ద‌రు సోద‌రులు అమ‌రావ‌తి జిల్లాలోని టెంబుర్‌ఖెడా అనే గ్రామంలో 7 ఏళ్ల కింద‌ట 50 ఎక‌రాల స్థ‌లాన్ని కొన్నారు. అందులో వారు అప్ప‌ట్లో 6,000 నారింజ మొక్క‌ల‌ను నాటారు. ఇప్పుడవి చేతికొచ్చాయి. అధిక దిగుబ‌డిని ఇస్తున్నాయి.

అలా ఉమేక‌ర్ సోద‌రులు ఆ నారింజ తోట‌తో పెద్ద ఎత్తున నారింజ‌ల‌ను పండిస్తూ ఏడాదికి రూ.1.50 కోట్ల లాభాల‌ను గ‌డిస్తున్నారు. వారు ఎంతో చ‌దువుకున్న‌ప్ప‌టికీ వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ‌తో నారింజ తోట‌ను ఏర్పాటు చేసి దాంతో కోట్లు సంపాదిస్తున్నారు. వీరి నారింజ‌లు దేశవ్యాప్తంగా అనేక న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు స‌ర‌ఫ‌రా అవుతుంటాయి.

మొద‌ట్లో వారు నారింజ మొక్క‌ల‌కు నీళ్లు పెట్టేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సుమారుగా 7 కిలోమీట‌ర్ల దూరం నుంచి నీళ్ల‌ను తెచ్చి మొక్క‌ల‌కు పోసి బ‌తికించారు. త‌రువాత స్మార్ట్ ఫార్మింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అనంత‌రం వారు వెనుదిరిగి చూడ‌లేదు. అధిక దిగుబ‌డిని సాధిస్తూ లాభాల బాట ప‌ట్టారు.

స‌రైన ప్ర‌ణాళిక‌, అవ‌గాహ‌న‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌సాయం చేస్తే ఇలా అధిక దిగుబ‌డిని సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ఉమేక‌ర్ సోద‌రులు చెబుతున్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో ఉమేక‌ర్ సోద‌రులు చేస్తున్న ప‌ని అలాంటి వారికి ప్రేర‌ణ‌ను అందిస్తోంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM