Udaya Bhanu : బుల్లితెరపై ఒకప్పుడు హల్‌చల్ చేసిన యాంకర్లలో ఉదయభాను ఒకరు. ఈమె ప్రస్తుతం ఉన్న యాంకర్లకు చాలా సీనియర్. దాదాపు యాంకర్ సుమ సమకాలీనురాలు. అయితే పలు కారణాల వల్ల ఈమె యాంకరింగ్ నుంచి తప్పుకుంది. పిల్లలు పుట్టాక పూర్తిగా ఇటు వైపు చూడడం మానేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె యాక్టివ్‌గానే ఉంటోంది. అప్పుడప్పుడు అందులో ఈమె తన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తుంటుంది. అయితే ఉదయభాను మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈమె ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా ప్రారంభించింది.
యాంకర్ ఉదయభాను లేటెస్ట్‌గా యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తన పేరిటే కొత్త చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇక మొదటి వీడియోను కూడా అందులో షేర్ చేసింది. అందులో ఆమె ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ ప్రేమే నా బలం, మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే.. అంటూ ఉదయభాను ఎమోషనల్ అయింది.

ఇక.. మీ అభిమానమే నన్ను నిలబెట్టింది. నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా.. మీ ఉదయ భాను.. అంటూ వీడియోను ముగించింది. కాగా ఉదయభాను షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆశిస్తూ నెటిజన్లు కూడా ఆమెకు మళ్లీ స్వాగతం పలుకుతున్నారు. అయితే యాంకర్‌గా ఉదయ భాను ఎంత సందడి చేస్తుందో తెలిసిందే. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో అదే జోరును కొనసాగిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.