Uday Kiran : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం.. అతడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ మూవీని ముందుండి నడిపించారు. అలాగే మహేష్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఫైట్స్ కూడా తెగ నచ్చేశాయి. ఇందులో మహేష్‌కు జోడీగా త్రిష నటించింది. కామెడీ కూడా హైలైట్ అయింది. అయితే వాస్తవానికి ఈ మూవీని ముందుగా ఉదయ్ కిరణ్‌తో చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. కానీ ఉదయ్ కిరణ్ ఈ మూవీని తిరస్కరించాడు.
అప్పట్లో త్రివిక్రమ్, తరుణ్ చేసిన నువ్వే నువ్వే ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత అతడు సినిమాను త్రివిక్రమ్.. ఉదయ్ కిరణ్ తో చేద్దామని అనుకున్నారు. నిర్మాణ సంస్థ జయభేరి వారు ఉదయ్ కిరణ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఎంత వీలు చేసుకున్నా కాల్ షీట్స్ కుదరలేదు. దీంతో ఉదయ్ కిరణ్ ఈ మూవీని చేయలేనని చెప్పాడు. అలాగే తీసుకున్న అడ్వాన్స్ ను కూడా ఉదయ్ వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ మూవీని పవన్‌తోనూ చేద్దామని త్రివిక్రమ్ అనుకున్నారట. కానీ ఆయన డేట్స్ కూడా అడ్జస్ట్ కాలేదు.
ఇక అప్పట్లో మహేష్ బాబు నాని సినిమా షూటింగ్ సమయంలో ఆయనను త్రివిక్రమ్ కలిసి స్టోరీ చెప్పారు. దీంతో మహేష్ ఓకే అనేశారు. అలా అతడు ప్రారంభమైంది. ఈ మూవీ చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. అయితే మరోమారు త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ ఖలేజా మూవీ చేశారు. కానీ అది ఫ్లాప్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ త్రివిక్రమ్ ఆ తరువాత ఇతర హీరోలతో అనేక సినిమాలు చేయగా.. వాటిల్లో చాలా వరకు సినిమాలు హిట్లుగా నిలిచాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…