Nassar : సీనియర్ నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. బాహుబలి సినిమాలో భల్లాల దేవ తండ్రి పాత్రలో మెప్పించారు. అలాగే అనేక సినిమాల్లో తాత, తండ్రి, సైంటిస్టు, టీచర్ వంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. అయితే నాజర్ ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చదువుదాం.
నేను, చిరంజీవి బ్యాచ్‌మేట్స్. ఇద్దరం ఒకే యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకున్నాం. చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండేవాన్ని. యాక్టింగ్ స్కూల్ చెన్కైలో ఉండేది. టైముకు చేరడం కోసం ఉదయం 6 గంటలకే బయలుదేరే వాన్ని. అప్పటికి అమ్మ కేవలం అన్నం మాత్రమే వండేది. దాన్ని బాక్స్ లా కట్టుకుని యాక్టింగ్ స్కూల్‌కు చేరుకునేవాన్ని. చిరంజీవి, ఇతరులు కొందరు అక్కడే బయట మెస్ నుంచి అన్నం తెప్పించుకునేవారు. అయితే ఒకసారి నా దగ్గర కేవలం అన్నం మాత్రమే ఉండడాన్ని చిరంజీవి చూశారు. రేపటి నుంచి అన్నం కోసం అమ్మగారిని ఉదయం లేపకు. అలా చేస్తే చంపేస్తా. నిద్రలేచి నేరుగా వచ్చేయి. నువ్వు కూడా మాతోపాటు తిను.. అని చిరంజీవి అన్నారు. ఆయన అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.. అలా చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.. అని నాజర్ అన్నారు.
ఇక యాక్టింగ్ స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం తనకు వెంటనే సినిమా చాన్స్‌లు రాలేదని నాజర్ అన్నారు. చిరంజీవికి మాత్రం వెంటనే అవకాశాలు వచ్చాయన్నారు. కానీ అప్పట్లో తన ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాలు తనకు సెట్ కావని నిర్ణయించుకుని తాజ్ కోరమాండల్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశానని.. ఓ సారి పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి చూశానని.. అయితే తాను వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా.. చిరంజీవి పిలిచారని.. ఏం చేస్తున్నావని అడిగితే.. హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నానని.. నాజర్ చెప్పారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ఇంత మంచి యాక్టర్‌వి హోటల్‌లో పనిచేయడం ఏంటి.. రేపు వచ్చి కలువు.. మాట్లాడుదాం.. అని చిరంజీవి అన్నారని నాజర్ తెలిపారు. అయినప్పటికీ తాను సినిమాల్లోకి వెళ్లొద్దని నిర్ణయించుకున్నానని.. కనుక చిరంజీవి పిలిచినా కలవలేదని అన్నారు. ఆ తరువాత బాలచందర్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. అప్పటి నుంచి ఇక వెను దిరిగి చూడలేదని నాజర్ అన్నారు. కాగా చిరంజీవిపై నాజర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…