Uday Kiran : చాలా తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లోనే ఉదయ్ అగ్ర హీరోలకు దీటుగా ఎదగడం ప్రారంభించాడు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా డేట్స్ కోసం ఎదరు చూసే స్థాయికి ఉదయ్ కిరణ్ చేరుకున్నాడు.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉదయ్ కిరణ్ సహజమైన నటనతో ఇండస్ట్రీలో హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల సినిమా అవకాశాలు తగ్గటం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే విషితను వివాహం చేసుకోవడం, అక్కడ కూడా సమస్యలు ఎదురవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ కు సినీ పరిశ్రమలో ఉన్న స్నేహితుల్లో హీరో అల్లరి నరేష్ కూడా ఒకరు. నరేష్, ఉదయ్ కిరణ్ గురించి ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు హీరో నరేష్ ఆయనను కలవటం జరిగిందట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ ముఖంలో దిగులు, బాధ కనిపించాయట. దాంతో ఎందుకు ఉదయ్ అలా డల్ గా ఉన్నావు అని ప్రశ్నించాను అని నరేష్ తెలియజేశాడు. నరేష్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ ఓ పేపర్ లో యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోవడం లేదని రాశారని ఆవేదన వ్యక్తం చేశాడట. దానికి నరేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. నీకు సంబంధించిన విషయం కాదు కదా అని అన్నానని తెలిపాడు నరేష్.
దాంతో ఉదయ్ కిరణ్ ఆ యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోకపోతే అతడికి కూడా ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని ఆ పేపర్ లో రాశారని బాధపడ్డాడట. దాంతో నరేష్.. ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యాడట. ఆ విషయంతో ఉదయ్ కిరణ్ ఎంతో డిప్రెషన్ లో ఉన్నాడని నరేష్ కి అర్థమైందట. ఇక ఉదయ్ కిరణ్ చనిపోయిన తరవాత అతడి మృతికి డిప్రెషన్ కూడా కారణమని నరేష్ కు అనిపించిందని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…