Star Couples : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణం. చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయో తెలియదు కానీ విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐదు స్టార్ జంటలు ఏవో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత 1997లో మొదటిసారిగా నందినిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బద్రి చిత్రంతో పరిచయమైన రేణుదేశాయ్ తో రిలేషన్ షిప్ ప్రారంభించారు.
2007లో తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి 2009 జనవరిలో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2012లో రేణుదేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చారు. 2013 నవంబర్ లో రష్యాకు చెందిన అన్నా లెజినివాను మూడవ వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 2010లో ఏ మాయ చేసావే చిత్రంలో నటించిన నాగచైతన్య, సమంత పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్ లో ఇరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సమంత, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
అక్కినేని కుటుంబానికే చెందిన మరో హీరో సుమంత్ కూడా తొలిప్రేమ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి 2004 లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట కూడా 2006లో విడాకులు తీసుకుని వివాహబంధానికి ముగింపు చెప్పారు. కీర్తిరెడ్డి ఆ తర్వాత వివాహం చేసుకొని యుఎస్ఎలో సెటిలైపోయింది. హీరో సుమంత్ మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవితం గడుపుతున్నారు.
హీరో సిద్దార్థ్ మేఘనను ప్రేమించి 2003లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడివిడిగా జీవితం ప్రారంభించి 2007లో విడాకులు తీసుకున్నారు ఈ జంట. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కే.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి రచయిత్రి స్క్రీన్ రైటర్ అయిన కనికా ధిల్లాన్ ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు. 2017లో ప్రకాశ్‌కు విడాకులు ఇచ్చి 2021లో హిమాన్షు శర్మను పెళ్లాడింది కనికా ధిల్లాన్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…