Samantha : నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంతను నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. తప్పతంతా ఆమెదే అన్నట్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి.. ఆమె గర్భం తీయించుకుందని, సరోగసీ కోసం సిద్ధమైందని.. ఆమె వ్యవహార శైలి అక్కినేని కుటుంబానికి నచ్చలేదని.. అందువల్లే విడాకులు తీసుకుంటున్నారని.. ఆ విషయాలను తమకు వారు చెప్పినట్లుగా కన్‌ఫాం చేస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది.
అలా తనపై చెడు ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్స్‌పై ఆమె కోర్టులో నష్టపరిహారం దావా వేసింది. అందులో ఆమె విజయం సాధించింది. దీంతో ఆ చానల్స్ వారు క్షమాపణలు చెప్పి ఆ వీడియోల తాలూకు లింక్‌లను తీసేశారు. ఆ తరువాత కోర్టు కూడా వ్యక్తిగత విషయాలకు చెందిన వివరాల పోస్టులను సోషల్ మీడియాలో పెట్టవద్దని సమంతకు సూచించింది. అది అయిపోయిన విషయం.
ఆ తరువాత సమంత ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్లడం, ఇతర టూరిస్టు ప్లేస్‌లకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలోనే పలు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అయితే కోర్టు కేసులు అవడం ఏమోగానీ.. సమంతపై వస్తున్న ట్రోలింగ్ కొంత వరకు ఆగిందనే చెప్పవచ్చు. ఇది ఆమె సాధించిన విజయమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఆమె ఆ విషయంపై కోర్టుకు వెళ్లకపోయినా.. కొంత కాలం ఓపిక పడితే అంతా అదే సద్దుమణుగుతుంది. ఈ విషయాన్ని పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఆమెకు చెప్పారు. అయినా ఆమె వినకుండా కోర్టు కేసుల దాకా వెళ్లింది. సరే.. ఏదైతేనేం.. కొన్ని రోజులుగా సమంతపై వస్తున్న ట్రోలింగ్ చాలా వరకు తగ్గింది. ఆమెను విమర్శించడం లేదు. యూట్యూబ్ చానల్స్ కూడా గమ్మున ఉన్నాయి. బహుశా ఇంకా ఏమైనా వీడియోలు పెడితే మళ్లీ కేసుల దాకా వెళ్లాల్సి వస్తుంది.. ఎందుకు రా బాబూ.. అనుకున్నారేమో.. దీంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు పెద్దగా వినబడడం లేదు.
కారణాలు ఏమున్నా సమంతపై వస్తున్న ట్రోలింగ్, విమర్శలు చాలా వరకు తగ్గాయనే చెప్పవచ్చు. దీంతో ఆమె కాస్తంత ఊపిరి పీల్చుకోనుంది. అయితే ఫ్యాన్స్ ఏ విషయాన్ని అంత త్వరగా మరిచిపోరు. గుర్తుకు వచ్చినప్పుడు మళ్లీ ట్రోలింగ్ మొదలు పెడతారు. మరి సమంత అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే.. ఏం చేస్తుందో చూడాలి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…