Nani : వెండితెరపై ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన బాలయ్య ఇప్పుడు డిజిటల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ అతిథులుగా వచ్చి షో రక్తి కట్టించారు. ఇక రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురి పేర్లు వినిపించగా చివరకు నాని రెండో ఎపిసోడ్ కు గెస్ట్‌గా వచ్చారు. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఇందులో నానిని గల్లీ క్రికెట్ ఆడతావా అని అడిగాడు బాలయ్య. అందుకు అవును అని అన్నాడు. తాను సెట్‌లో క్రికెట్ ఆడుతానంటూ బాలయ్య చెప్పాడు. క్రికెట్ కిట్ తన కారులో తప్పక ఉంటుందని చెప్పిన బాలయ్య గార్డ్ కూడా ఉంటుందని చెప్పి నవ్వించాడు. ఇక ఏదో విషయంలో పులిహోర కలపకు అంటూ నానిని ఉద్దేశించి అంటాడు బాలయ్య. ప్రోమో చూస్తుంటే ఇది కూడా మంచి ఎంటర్‌టైన్ అందించనున్నట్టు తెలుస్తోంది.
టక్ జగదీష్ వివాదం కూడా చర్చకు వచ్చింది. చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసినందకు నానిపై డిస్ట్రిబ్యూటర్స్ మండిపడ్డారు. ఈ విషయంపై ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీని వలన నాని మళ్లీ వివాదంలో ఇరుక్కుంటాడా అని ముచ్చటించుకుంటున్నారు.
నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. ఇందులో అతని చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా ఉంది. రెండో ఎపిసోడ్‌లో బాలయ్యతో నాని సందడి ఓ రేంజ్‌లో ఉంటుందని అర్ధమవుతుంది. నాని సినిమాల విషయానికి వస్తే చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. తాజాగా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…