Traffic Challan : రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ చలాన్లపై అందిస్తున్న రాయితీ ఆఫర్‌ను మరికొద్ది రోజుల పాటు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మరో 15 రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఎత్తున రాయితీ అందిస్తుండడంతో వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ చలాన్లను చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఆఫర్‌కు లభిస్తున్న స్పందనను చూసి మరికొద్ది రోజుల పాటు ఇందుకు గడువును పెంచుతున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ చలాన్లు ఇప్పటికే భారీ ఎత్తున రాష్ట్రంలో పెండింగ్‌లో ఉండగా.. వాటిని ఎలా క్లియర్ చేయాలో ఆ శాఖ అధికారులకు తెలియడం లేదు. దీంతో మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ట్రాఫిక్ చలాన్లపై భారీ ఎత్తున రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ద్వి, త్రిచక్ర వాహనాలకు 75 శాతం, కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం, ఆర్‌టీసీ బస్సులకు 70 శాతంతోపాటు కరోనా కాలంలో మాస్క్ ధరించకుండా ప్రయాణించిన వారికి ట్రాఫిక్ చలాన్లపై ఏకంగా 90 శాతం రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా ఆఫర్‌ను అందించడంతో వాహనదారులు పెద్ద ఎత్తున ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల మేర చలాన్లను చెల్లించారు. ఈ క్రమంలోనే మార్చి 31వ తేదీ వరకు గడువు ముగిసింది. అయితే ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందనతోపాటు వాహనదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ ఆఫర్‌కు గడువును మరికొన్ని రోజుల పాటు పెంచారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును పెంచారు. దీంతో మరింత మంది వాహనదారులకు ఊరట లభించనుంది. అలాగే ఇంకా భారీగానే చలాన్లు వసూలు అవుతాయని భావిస్తున్నారు.