Prabhas : టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌.. ఆయన ఆస్తులెన్నో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక కృష్ణం రాజు వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ సొంతంగానే అవకాశాలు దక్కించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ హీరో అని గుర్తింపు పొందాడు. అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు.. ఆయన ఆస్తుల వివరాలేంటో చూద్దాం.. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల నుంచి 150కోట్ల పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్. ఈ రోజు ఆయన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. ప్రభాస్‌ పై ప్రస్తుతం దాదాపు 3-4 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయన ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి నాలుగైదు వందల కోట్లతో తెరకెక్కుతున్నాయి.

దీంతో ఒక్కో సినిమాపై 1000 కోట్ల నుంచి, 1500కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతున్నాయి. ఈ లెక్కన ఈ 3 సినిమాలపై సుమారు 4000 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పవచ్చు. దీంతో ప్రభాస్‌ పేరుతోనే ఓ మిని ఇండస్ట్రీ రన్‌ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ప్రభాస్‌ ఫ్యామిలీ రాజుల కుటుంబానికి చెందినదని తెలిసిందే. వందల, వేల ఎకరాలు వారి ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చాయని తెలుస్తుంది. పెదనాన్న కృష్ణంరాజు సహకారంతో ప్రభాస్‌ నాన్న సత్యనారాయణరాజు నిర్మాతగా రాణించారు. ఆయన గోపీకృష్ణ మూవీస్‌పై పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాతగానే కాదు, ఆయన వ్యాపారిగానూ రాణించారు. వీరికి ఒక గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఉందని తెలుస్తుంది. దీనికితోడు హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి పలు ప్రధాన నగరాల్లో ఫామ్‌ హౌజ్‌లున్నాయి. మరోవైపు థియేటర్‌ రంగంలోనూ ఉన్నారు.

Prabhas

అంతేకాదు వందల ఎకరాల పంటపొలాలు, కొబ్బరి తోటలున్నాయి. హైదరాబాద్‌ శివారులో వందల ఎకరాల్లో ఓ ఫారెస్టే ఉంది. సొంతూరులో వేల ఎకరాలున్నాయని సమాచారం. కృష్ణంరాజు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు నలుగురు కుమార్తెలే. అబ్బాయిలు లేరు. దీంతో ప్రభాసే వారికి కొడుకుగా భావిస్తుంటారు. కృష్ణంరాజు ఫ్యామిలీ బాధ్యత కూడా ప్రభాసే తీసుకుంటున్నారు. కృష్ణంరాజుకి సైతం వందల ఎకరాలు భూములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ఫామ్‌ హౌజ్‌లు, తోటలున్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రభాస్‌కే చెందుతాయని చెప్పవచ్చు. లాంబోర్గిని అవెంటేడర్‌ రోడస్టర్ కారు, రోల్స్ రాయిస్‌ ఫాంటమ్‌ కారు, ల్యాండ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ కార్లు, జాగ్వర్‌ ఎక్స్ ఎల్‌, బీఎండబ్ల్యూ ఎక్స్ 3 కార్లున్నాయి. వీటి కాస్ట్ సుమారు 10 కోట్లకుపైగానే ఉంటుంది. హైదరాబాద్‌ శివారులో ఇప్పుడు ఓ ఫామ్‌ హౌజ్‌ కట్టిస్తున్నారు ప్రభాస్‌. ఇలా మొత్తంగా ప్రభాస్‌ ఆస్తులు 7 నుంచి 8 వేల కోట్లు ఉంటాయని సమాచారం. దీన్నిబట్టి టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌ అని చెప్పవచ్చు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

Aquarium In Home : ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదేనా.. చేప‌ల‌ను ఇంట్లో పెంచ‌వ‌చ్చా..?

Aquarium In Home : మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు…

Monday, 29 April 2024, 7:38 AM

Animals In Dreams : ఈ జంతువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లో అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..!

Animals In Dreams : ప్రతి ఒక్కరు నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన…

Sunday, 28 April 2024, 7:14 PM

Death Person Items : మ‌ర‌ణించిన వ్య‌క్తి యొక్క ఈ 3 వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉప‌యోగించ‌కూడ‌దు..!

Death Person Items : మ‌నిషి పుట్టిన త‌రువాత మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు. పుట్టుక‌, చావు అనేవి మ‌న చేతుల్లో ఉండ‌వు.…

Sunday, 28 April 2024, 12:34 PM

Diabetes Health Tips : దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు..!

Diabetes Health Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి…

Sunday, 28 April 2024, 7:53 AM

Gents Bath : పురుషులు స్నానం చేసే స‌మ‌యంలో చేస్తున్న త‌ప్పులు ఇవే..!

Gents Bath : మ‌నం రోజూ అనేక ప‌నుల‌ను చేస్తూ ఉంటాము. మ‌నం చేసే ఈ ప‌నుల‌ల్లో మ‌న‌కు తెలిసీ,…

Saturday, 27 April 2024, 8:03 PM

Garikapati Narasimha Rao : పానీపూరీల‌ను తినే వారంద‌రూ త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Garikapati Narasimha Rao : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. చిన్న, పెద్దా…

Saturday, 27 April 2024, 12:35 PM

Nalleru Podi : న‌ల్లేరు పొడి ఇలా చేయాలి.. మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు సైతం లేచి ప‌రుగెడ‌తారు..!

Nalleru Podi : మ‌నకు ప్ర‌కృతి ప్రసాదించిన దివ్యౌష‌ధ మొక్క‌ల‌ల్లో నల్లేరు మొక్క కూడా ఒక‌టి. న‌ల్లేరు మొక్క‌లో ఎన్నో…

Saturday, 27 April 2024, 7:44 AM

Heart Health Foods : దీన్ని తాగితే చాలు.. హార్ట్ ఎటాక్ అస‌లే రాదు..!

Heart Health Foods : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. హార్ట్ బ్లాక్స్,…

Friday, 26 April 2024, 8:16 PM