Chiranjeevi Hitler Movie : కొన్ని సినిమాలు ఒకరి కోసం కథ సిద్ధం చేసుకొని.. కొన్ని కారణాల వల్ల మరొకరిని హీరోగా తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఒక హీరో వద్దని వదులుకున్న ఆ చిత్ర కథాంశంతోనే మరొక హీరో సక్సెస్ ని అందుకుంటారు. ఇలాంటి సంఘటనే చిరంజీవి విషయంలోనూ జరిగింది. అప్పటికే మూడేళ్లుగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న చిరంజీవి కెరీర్ ని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన సినిమా హిట్లర్. 1997లో విడుదలైన హిట్లర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని కీలక మలుపు తిరిగింది. చిరంజీవి కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని పేర్కొంటున్నారు. ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మూవీ మేకర్స్ కథను రూపొందించడం జరిగింది.
ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1997 జనవరి 4వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంలో మమ్ముట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న హిట్లర్ చిత్రమును తెలుగులో కూడా హిట్లర్ అనే పేరుతోనే రీమేక్ చేశారు. నిర్మాత, ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్‌రాజా హిట్లర్ మ్అ మూవీకి సిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. మోహన్‌రాజా మలయాళ వెర్షన్ విడుదలకు ఒకవారం ముందు ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ రీమేక్ చిత్రం మలయాళంలో విడుదలకు కొన్ని రోజుల ముందే మోహన్ ప్రముఖ రచయిత మరుధూరి రాజాను సినిమా చూడాలని కోరారట. ఆ తరువాత రాజా దంపతులు తమ హోటల్ గదిలో హిట్లర్ మూవీని వీక్షించడం జరిగింది. అయితే ఈ సినిమా ముందు చిరంజీవితో చేయాలి అనుకోలేదట నిర్మాతలు. హిట్లర్ సినిమా కథని ముందుగా ఒక హీరో కోసం సిద్ధం చేసుకున్నారట దర్శకనిర్మాతలు .. ఆయన కాదన్న తర్వాతే ఈ సినిమా చిరుని వరించింది. హిట్లర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వదులుకున్న ఆ హీరో ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.
హిట్లర్ సినిమా అవకాశాన్ని మోహన్ బాబు తిరస్కరించడంతో ఆ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల్లోకి వెళ్లింది. సినిమా బ్లాక్ బస్టర్ అయిన వెంటనే చిరంజీవి యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా, ఐదుగురు చెల్లెలు గురించి తపన పడే అన్నగా చిరంజీవి తన నటనకు వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నటించగా, ప్రతినాయకుడిగా ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ రంభ గ్లామర్ షో తో పాటు రాజేంద్రప్రసాద్, సుధాకర్, బ్రహ్మానందం కామెడీ హైలేట్ గా నిలిచాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…