Tollywood : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సాహితీ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సిరివెన్నెల మరణంతో ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 3న ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ముందుగా నిర్ణయించింది. అయితే సీతారామశాస్త్రి కన్నుమూతతో దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల కొత్త తేదీని త్వరలోనే చెబుతామంటూ తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ అడవి తల్లి పాట విడుదల వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా సాంగ్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.
కవిత్వానికి ఒంపులు, అక్షరంలో అందాలు గుర్తించిన సిరివెన్నెలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట.. విధాత తలపున.. దీంతో అవార్డులు అందుకోవడం ఆయనకు మొదలైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…