Tollywood : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలోనే నాగార్జున, చిరంజీవి పలుమార్లు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి మరోమారు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అయితే ఈ సారి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎన్‌టీఆర్ హాజరు కాలేదు. కాగా వారందరూ సీఎం జగన్‌ను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక చిరంజీవి గతంలోనే పలు మార్లు సీఎం జగన్‌ను కలిశారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్‌ను కలవడం, తాజా సమావేశంలో పలువురు అగ్ర హీరోలు కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్ఆర్ఆర్ తోపాటు భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విషయం తేల్చకపోతే ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కలసి సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారందరూ విజయవాడకు తరలివెళ్తున్నప్పుడు ప్రైవేటు జెట్‌లో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…