Samantha : సినిమా సెలబ్రిటీలు అనగానే చాలు.. సహజంగానే వారి వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుందని, వారు ఆస్తి పరులని అందరూ అనుకుంటుంటారు. అయితే వాస్తవానికి అందరి జీవితాలు ఒక్కటే విధంగా ఉండవు. ముఖ్యంగా సమంత విషయానికి వస్తే చాలా మంది ఆమె బాగా ఆస్తిపరురాలని, ఆమె వద్ద డబ్బు బాగా ఉందని అనుకున్నారు. కానీ అది నిజం కాదట.
2021 ఆమెకు అత్యంత బాధాకరమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే నాగచైతన్యకు ఆమె విడాకులు ఇచ్చింది మరి. వాస్తవానికి చైతూ కన్నా సమంతకే ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆమె బోల్డ్ సీన్లలో నటించడం వల్లే చైతూ ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని కొందరు కామెంట్లు చేయగా.. ఆమె అబార్షన్ చేయించుకుందని, పిల్లల్ని కనడం ఇష్టం లేదని.. కొందరు కామెంట్లు చేశారు. అయితే అవన్నీ అబద్దమని తరువాత తేలింది. సమంత అలాంటి కామెంట్లు చేసేవారిపై కోర్టుకు వెళ్లడంతో అవన్నీ అబద్దాలేనని స్పష్టమైంది.
ఇక విడాకుల అనంతరం వచ్చే భరణం కోసమే నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందని కొందరు అన్నారు. రూ.200 కోట్ల మేర ఆమెకు కట్నం ఇవ్వబోయినా ఆమె వద్దందని వార్తలు వచ్చాయి. ఇక నాగచైతన్య ఆమెకు ఇచ్చిన ఇల్లు ఒకటి ఆమె వద్దే ఉందని, ఆమె దాన్ని తీసుకుందని అన్నారు. కానీ సమంత ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసి వేరే ఇల్లును అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ తరువాత చైతన్య ఆ ఇంటిని అమ్మేసినట్లు తెలిసింది.
కాగా సమంత కెరీర్‌ను, ఆమె పాపులారిటీని చూసి చాలా మంది ఆమె వద్ద డబ్బులు, ఆస్తులు బాగా ఉన్నాయని అనుకుంటున్నారట. కానీ ఆమెకు చెన్నై, హైదరాబాద్‌లలో ఒక్కో ఇల్లు ఉందట. వాటిలో ఆమె ఉండడం లేదు కానీ రెంట్‌కు ఇచ్చిందట. దీంతో వాటికి నెల నెలా కొన్ని వేల రూపాయల్లో మాత్రమే రెంట్ వస్తుందట. ఇక హైదరాబాద్‌లోని ఎస్ఎల్ఎన్ టర్మినస్‌లో ఆమెకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆమెకు ఒక మోస్తరు రెంట్ వస్తుందట.
పైన చెప్పిన ఆస్తులు కాకుండా సమంతకు ఇంకా ఎలాంటి ఆస్తులు లేవని, ఉంటే కొన్ని కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే సమంతకు ఆస్తులు పెద్దగా లేవని కూడా ప్రచారం జరుగుతోంది. తన తల్లిదండ్రులు వారి తరఫు కుటుంబాలను ఆదుకోవడమే సమంత లక్ష్యంగా పెట్టుకుందట. దీంతో తాను ఏమీ వెనకేసుకోవడం లేదని తెలిసింది. మరో వైపు ఆమె ఓ చారిటీకి కూడా పెద్ద ఎత్తున విరాళంగా ఇస్తుంటుంది. కనుక సమంతకు అందరూ అనుకున్నట్లు భారీ ఎత్తున ఆస్తులు ఏమీ లేవని స్పష్టం చేస్తున్నారు.
సమంత ఇండస్ట్రీకి వచ్చి 10-12 ఏళ్లవుతోంది. మహా అయితే ఇంకో 3-4 ఏళ్లు ఉంటుందేమో. ఎందుకంటే హీరోల కన్నా హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండే కాలం చాలా తక్కువ. అంతటి తక్కువ సమయంలో బాగా ఆస్తులను సంపాదించాలన్నా కష్టమే. భారీ ఎత్తున రెమ్యునరేషన్ కూడా లభించాలి. కనుక సమంత పెద్దగా ఆస్తులను కూడబెట్టలేదని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఆమె ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…