Toe Nail Fungus : మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారిస్తుంది. డాక్టర్లు కొన్ని కొన్ని సమయాలలో కళ్ళు, నాలుకతోపాటు గోళ్లను చూసి మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా కొందరికి గోళ్లు పుచ్చిపోయి ఉంటాయి. దానికి అసలు కారణం ఏమిటనేది తెలియదు. కానీ గోళ్లు బాగా పుచ్చిపోయి నొప్పితో బాధ పడుతూ ఉంటారు. కొందరికైతే గోరు చుట్టు పక్కల భాగమంతా ఎర్రగా అయిపోతుంది. దానివలన భరించలేని నొప్పి కలుగుతుంది. ఇందుకోసం రకరకాల మందులు వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించదు. మరికొందరికి విటమిన్స్ లోపం కారణమైతే, మరికొందరిలో బట్టలకు వాడే సబ్బులు లేక సర్ఫ్ వలన కూడా గోర్లు పుచ్చిపోతాయి. మరి పుచ్చిపోయిన గోళ్లను తిరిగి ఆరోగ్యం ఎలా మార్చుకోవాలో ఈ చిట్కా ద్వారా తెలుసుకుందాం.
ఈ చిట్కాతో గోళ్లు పుచ్చడం తగ్గి అందంగా తయారవుతాయి. దీనికోసం ముందుగా అయిదారు లవంగ మొగ్గలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ లవంగాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెను హీట్ లో స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పదినిమిషాల పాటు బాగా మరిగించాలి. లవంగాలలో ఉండే పోషక విలువలు మొత్తం నూనెలోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం కాటన్ లేదా ఇయర్ బడ్ తో ఈ నూనెను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చిన గోళ్లపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు చొప్పున గోళ్లు పుచ్చిన చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. ముందుగా పుచ్చిన గోళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పుచ్చిన గోళ్లు మొత్తం ఊడిపోయి ఆ స్థానంలో కొత్త గోళ్లు రావడం మొదలవుతాయి. గోళ్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…