Tiger Nageshwar Rao : రవితేజ ప్రధాన పాత్రలో వంశీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.. టైగర్ నాగేశ్వర్ రావు. ఈ సినిమాను బందిపోటు దొంగ నాగేశ్వర్ రావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం రవితేజ తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఇక 1970లలో స్టూవర్ట్ పురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందుకు గాను ఓ భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు.

నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్ వేసి మెప్పించారు. అచ్చం కోల్‌కతాలో అప్పట్లో ఉన్నట్లే ఆ సినిమాలో చూపించారు. చాలా సహజసిద్ధంగా సెట్ వేశారు. దీంతో ఆయనే ఇప్పుడు టైగర్ నాగేశ్వర్ రావుకు కూడా పనిచేస్తున్నారు. అందుకు గాను ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ విస్తీర్ణంలో సెట్ నిర్మిస్తున్నారు. 1970లలో స్టూవర్ట్‌పురం ఎలా ఉండేదో.. అచ్చం అలాగే సహజసిద్ధంగా సెట్‌ను రూపొందిస్తున్నారు.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్‌లో ఏకంగా 5 ఎకరా స్థలాన్ని ఇందుకు లీజ్‌కు కూడా తీసుకున్నారు. అక్కడే స్టూవర్ట్‌పురం సెట్ వేస్తున్నారు. దానికి అవినాష్ పనిచేస్తున్నారు. ఇక కేవలం ఈ సెట్ వేసేందుకే మేకర్స్ రూ.7 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీంతో చాలా పకడ్బందీగా.. అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ విలువలతో పనిచేస్తున్నారని అర్థమవుతోంది. ఇక టైగర్ నాగేశ్వర్ రావు మూవీ పాన్ ఇండియా సినిమా కనుక పెట్టిన బడ్జెట్ కచ్చితంగా వచ్చి తీరుతుందని ఆశిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఆర్ మాధే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.