Tiger Nageshwar Rao : బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్‌టీఆర్ బయోపిక్ సినిమా గుర్తుంది కదా. ఆ మూవీ రెండు పార్ట్‌లుగా రిలీజ్ అయింది. ఒకటి ఎన్‌టీఆర్ సినిమాల గురించి కాగా.. ఇంకొకటి రాజకీయాల గురించి ఉంటుంది. బాలకృష్ణ ఆ మూవీల్లో ఎన్‌టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే అదే సమయంలో వాస్తవాలను చెబుతున్నాం.. అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ పేరిట ఓ మూవీని తెరకెక్కించారు.
అయితే బాలకృష్ణ తీసిన రెండు సినిమాలు ఏమో గానీ.. వర్మ తీసిన సినిమాకే మంచి పాపులారిటీ దక్కిందని చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ఒకే సమయంలో ఒకే కథతో రెండు భిన్న సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఇక తాజాగా అలాంటి విచిత్రమే జరుగుతుందని చెప్పవచ్చు.
స్టువర్ట్‌పురంలో ప్రజలచే నాయకుడిగా కీర్తించబడి.. పోలీసులకు దొరకకుండా వారికి ముచ్చెమటలు పట్టించిన టైగర్ నాగేశ్వర్ రావు.. జీవిత చరిత్రతో మాస్ మహరాజ రవితేజ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీని అనౌన్స్ చేసి ఒక్క రోజు కూడా కాకముందే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అదే టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ పేరిట ఇంకో మూవీని అనౌన్స్ చేశారు. ఆ మూవీని స్టూవర్ట్ పురం దొంగ పేరిట తెరకెక్కిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైగర్ నాగేశ్వర్ రావు పాత్రను పోషించనున్నాడు.
అయితే ఇలా ఒకే వ్యక్తి బయోపిక్‌ను ఇద్దరు హీరోలు రెండు వేర్వేరు సినిమాలుగా తీస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా మూవీలను అనౌన్స్ చేశారా.. లేదైనా ఇంకేదైనా కారణం ఉందా.. అన్న వివరాలు తెలియవు కానీ.. ఇద్దరూ తీస్తున్నది టైగర్ నాగేశ్వర్ రావు గురించే కావడం విశేషం.
ఈ క్రమంలోనే స్టూవర్ట్ పురం దొంగలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్‌ను దీపావళి సందర్బంగా రివీల్ చేశారు. అందులో సాయిశ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఇక రవితేజ లుక్‌ను కూడా రివీల్ చేయాల్సి ఉంది. మరి కథ ఒకటే అయినా.. ఇద్దరిలో ఎవరి మూవీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…