CM KCR : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఏమో గానీ.. ఆయన వచ్చి వెళ్లాక.. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు ఓ వైపు, తెరాస మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు ఓ వైపు.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరు ఇస్తున్న కౌంటర్‌కు ఇంకొకరు ప్రతిగా కౌంటర్ వేస్తున్నారు.
అయితే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. తనకు బదులుగా ఆ స్థానంలో మోదీని రిసీవ్ చేసుకునే బాధ్యతను ఆయన మంత్రి తలసానికి అప్పగించారు. అయితే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యవహార శైలిపై ఇటు బీజేపీ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పెట్టిందని పేరని విశ్లేషకులు అంటారు. అందుకని ఆయన కారణం లేకుండా ఏ పని చేయరు. ఆయన ప్రధాని పర్యటనకు రాకపోవడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉందని, ఓ వ్యూహం ప్రకారమే ఆయన ఆ విధంగా చేశారని అంటున్నారు.
బీజేపీని వ్యూహాత్మకంగా రెచ్చగొట్టడం ద్వారా వారితో తిట్లు తిని.. అనంతరం తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ ప్రజల్లోకి చొప్పించి తద్వారా ఎన్నికలకు వెళితే ప్రయోజనం కలుగుతుందని.. సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ మమత ఇలాంటి ఫార్ములానే వాడారు. ఇక తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఇదే ఫార్ములాను వాడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకీ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం వర్సెస్ తెలంగాణ అనే నినాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తే.. అప్పుడు ప్రజలు కచ్చితంగా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారు. అందుకనే సీఎం కేసీఆర్ ఆ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారని తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా కేంద్రంపై ఇలా మాటల యుద్ధం చేసే వ్యూహాన్ని ఇప్పటి నుంచే అనుసరిస్తే తద్వారా సీఎం కేసీఆర్‌కు రెండు విధాలుగా లాభం కలుగుతుందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ను కాదని, బీజేపీని తెరాసకు ప్రత్యర్థిగా చేయడం, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం, మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించడం.. ఇలా రెండు విధాలుగా ఈ వ్యూహం కలసి వస్తుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అందుకనే మొదటి స్టెప్‌లో భాగంగా ఆయన ప్రధాని పర్యటనకు హాజరు కాలేదని తెలుస్తోంది.
ఇక మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు గత 3, 4 రోజుల నుంచి దూకుడు పెంచారు. సోషల్ మీడియాలో వారు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. బీజేపీకి సోషల్ మీడియా బలం ఎక్కువ కనుక ఆ విధంగా ఆ పార్టీపై పోరాటం చేసేందుకు ట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వార్ ఒక రేంజ్‌లో నడుస్తోంది. వేర్ ఈజ్ ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్‌తో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను, రాష్ట్రానికి ఇస్తామన్న హామీలను మోడీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నప్పటికీ టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ సడెన్ వ్యూహంతో బీజేపీ కొంత డైలమాలో పడినట్లు స్పష్టమవుతోంది. మరి బీజేపీ నేతలు టీఆర్ఎస్ అటాక్‌ను ఏవిధంగా తిప్పికొడతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…