SS Rajamouli : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఇటీవల ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను ఫిలిం స్టూడియోలో కలిసిన విషయం విదితమే. అయితే రాజమౌళి ఉన్న ఫలంగా ముంబైకి వెళ్లి సల్మాన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి సడెన్ గా ముంబైకి తన కుమారుడితో సహా వెళ్లి సల్మాన్‌ను ఎందుకు కలిశారు ? అన్న అంశంపై తీవ్రమైన చర్చ కొనసాగింది. కొందరు సల్మాన్‌తో రాజమౌళి మూవీ తీయబోతున్నారని.. స్టోరీ వినిపించేందుకు వెళ్లారని అన్నారు. ఇక కొందరైతే.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం సల్మాన్‌ను కలిశారని, ఆయనతో బాలీవుడ్‌లో మూవీ కోసం ప్రమోషన్స్ చేయించాలని రాజమౌళి చూస్తున్నారని, అందుకనే రాజమౌళి.. సల్మాన్‌ను కలిసి ఉంటారని.. వార్తలు వచ్చాయి. అయితే సల్మాన్‌ను రాజమౌళి ఎందుకు కలిశారో తెలిసిపోయింది. ఆ మీటింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే..
RRR మూవీకి గాను దుబాయ్‌లో ప్రీ రిలీజ్ వేడుకలను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో మూవీకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకనే అక్కడ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలని చిత్ర యూనిట్ చూస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే దుబాయ్‌లో జరగనున్న RRR మూవీ ప్రీ రిలీజ్ వేడుకలకు సల్మాన్ ఖాన్‌ను చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి ఆహ్వానించారు. అందుకోసమే రాజమౌళి ముంబై వెళ్లి సల్మాన్‌ను కలిశారు. ఇక సల్మాన్ కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే భారీ ఎత్తున పబ్లిసిటీ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకోసమే సల్మాన్‌ను ఒప్పించేందుకు రాజమౌళి ముంబై వెళ్లి ఆయనను కలిశారట.
కాగా దుబాయ్‌లో జరగనున్న RRR ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా నిర్దిష్టమైన తేదీని అనుకోలేదట. దీంతో త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక RRR మూవీని జనవరి 7, 2022వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.