The Warrior Movie : లింగుస్వామి దర్శకత్వంలో రామ్, కృతిశెట్టి హీరోయిన్లుగా వచ్చిన మూవీ.. ది వారియర్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఏర్పడినా.. ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీకి కేవలం 50 శాతం మాత్రమే వెనక్కి వచ్చింది. అంటే.. రూ.35 కోట్ల లాస్ వచ్చిందని తెలుస్తోంది. అయితే జూలై 14వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ది వారియర్ మూవీకి గాను డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక మూవీ రిలీజ్ అనంతరం 4 వారాలకు ఓటీటీలోకి వచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. అందువల్ల ఈ మూవీని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఫ్లాప్ అయింది కనుక ఇంకా త్వరగానే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. కాగా ఓటీటీలో రిలీజ్ అయ్యే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

ది వారియర్ మూవీలో నదియా, అక్షర గౌడ, ఆది పినిశెట్టిలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని శ్రీనివాస నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే పాటలు బాగానే ఉన్నాయి కానీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదని.. దేవి శ్రీ ఇంత లో క్వాలిటీ మ్యూజిక్‌ను అందిస్తాడని అనుకోలేదని.. ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది.