The Legend : అరుళ్ శరవణన్ ది లెజెండ్ మూవీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నింటి మీద ట్రోలింగ్ చేశారు. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు. ఎట్టకేలకు ది లెజెండ్.. పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది. ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్ లుక్స్ గురించి, 51 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ.. రూ.80 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడేంటీ.. ఇతను ఏమైనా పిచ్చోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
సినిమాపై నెగిటివిటీ ఉన్నప్పటికీ కొంతవరకు ఈ జనాలు ఈ మూవీని చూడడానికి వెళ్లారు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ది లెజెండ్ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.82 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళనాడులో అయితే శరవణన్ స్టోర్స్ లో షాపింగ్ చేసిన జనాలకు ది లెజెండ్ టికెట్ రేట్లు మరియు స్నాక్స్ కూపన్స్ తో తక్కువ రేట్లకు బహుమతిగా ఇచ్చారు. అయినప్పటికీ ఈ మూవీ రూ.70 కోట్ల నష్టాలను మిగిల్చిందని సమాచారం. ఈ మూవీలో శరవణన్ సరసన హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రూటేలా, రాయ్ లక్ష్మీ నటించారు.

జేడీ జెర్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వయంగా శరవణనే నిర్మించాడు. ఎట్టకేలకు ది లెజెండ్ మూవీ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ది లెజెండ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 23 లేదా 30 నుండి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని కోలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లో ది లెజెండ్ మూవీ అందుబాటులోకి రానుంది. థియేటర్ లో నిరుత్సాహపరిచిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.