Deeksha Seth : వేదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. దీక్షా సేథ్. ఈ మూవీ ఈమెకు మొదటి సినిమా కూడా కావడం విశేషం. అయితే వేదం కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ దీక్షా సేథ్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. గ్లామర్ షో చేయడం ప్లస్ పాయింట్ కావడంతో ఈ అమ్మడికి అప్పట్లో అవకాశాలు క్యూ కట్టాయి. తరువాత ఆమె మిరపకాయ్ అనే సినిమాలో రవితేజ పక్కన నటించింది. కానీ ఇందులో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్రే. కనుక ఈ మూవీ హిట్ అయినప్పటికీ అది ఈ అమ్మడి ఖాతాలో పడలేదు.
ఇక ఆ తరువాత వాంటెడ్, నిప్పు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, రెబల్ వంటి తెలుగు సినిమాలతోపాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ ఈమె నటించి ఆయా భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఏవీ హిట్ కాలేదు. దీంతో ఈమె క్రమంగా తెరమరుగు అయిపోయింది. అయితే దీక్షా సేథ్ తలచుకుంటే ఇంకా కొన్నేళ్లపాటు అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఉండేది. కానీ ఆమె త్వరగా ఆ రంగానికి దూరమైంది. కారణం.. ఓ హీరో అని తెలుస్తోంది. అతని వల్లే ఆమె కెరీర్ అర్థాంతరంగా ముగిసిందట.

సదరు హీరో అప్పట్లో ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉండడంతో అనుమానం వచ్చిన దీక్షా సేథ్ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందట. దీంతో అతనికి బ్రేకప్ చెప్పి ఇకపై సినిమా రంగానికి దూరంగా ఉండాలని.. సినిమా వాళ్లను నమ్మకూడదని అనుకుందట. కనుకనే ఇక సినిమాలు చేయకుండా ఆ రంగానికి దూరమైందట. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇక దీక్షా సేథ్ సినిమాల్లోకి రాకముందు 2009లో ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లింది. అందం, అభినయం, గ్లామర్ షో చేసే సత్తా ఉన్నప్పటికీ దీక్షా సేథ్ సినిమా కెరీర్ మాత్రం అర్థాంతరంగానే ముగిసింది. మరి భవిష్యత్తులోనైనా ఈ అమ్మడు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.