తన శరీరంలోని చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దళితుల కోసం పోరాటం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం విదితమే. కాగా ఈ పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడ్డామని అన్నారు. అదేవిధంగా దళిత బంధు కోసం కూడా పోరాటం చేస్తామని అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. తన శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ పథకం కోసం, దళితుల అభివృద్ధి కోసం పోరాడుతానని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా దళితల జాతి పేదరికంలో మగ్గిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు సభ్య సమాజమే కారణమన్నారు. దళితులు సామాజిక వివక్షకు గురవుతున్నారని తెలిపారు. దళితుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని విడనాడాలని అన్నారు. వారు అన్ని రంగాల్లోనూ ఎదగాలని, అందుకు గాను సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…