దేశ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ(65) అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట కోవిడ్ సెంటర్ లో చేర్చారు. అయితే ఆ వృద్ధురాలు మరణించడంతో ఆస్పత్రి సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉదయమే వచ్చి శవాన్ని తీసుకు వెళ్తామని చెప్పారు.
ఉదయం వచ్చిన బంధువులు ఆస్పత్రి రాగానే ఆమె శవాన్ని అప్పగించారు. ఆ శవాన్ని అక్కడినుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఆ శవం తమ వారిది కాదని గుర్తించడంతో ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.
అదే రోజు వీరన్నపేట గ్రామస్తులు రాకముందే అదే పేరుతో ఉన్న మరో వృద్ధురాలు మరణించింది. పొరపాటున వాళ్లు వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ శవాన్ని సిద్దిపేట పట్టణానికి చెందిన వారికి ఇవ్వడంతో వారు ఆ శవాన్ని తీసుకెళ్లారు.
తప్పు తెలుసుకున్న అధికారులు వారికి ఫోన్ చేసి సమాచారం తెలుపుగా అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే ప్రస్తుతం ఉన్నది వారి బంధువులు శవమే వచ్చి తీసుకెళ్లాలని ఆస్పత్రి అధికారులు చెప్పగా వారు ఫోన్ కట్ చేసే స్విచ్ ఆఫ్ చేశారు. ఈ విధంగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో వారికి ఏం చేయాలో తెలియక వజ్రమ్మ శవాన్ని మార్చురీలోనే ఉంచారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా శవాలు తారుమారయ్యాయని తెలుస్తోంది.