గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రతి ఒక్క రంగంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా ధాటికి ఎంతోమంది ఉద్యోగాలు పోవడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. మరికొందరు వారికి దొరికిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ టీచర్లపై కూడా కరోనా ప్రభావం పడింది.
హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ బోలక్ పూర్ ప్రాంతానికి చెందిన సెయింట్ సాయి పాఠశాల యజమాని కరోనా కారణం వల్ల కూరగాయల వ్యాపారి గా మారారు. ఈ పాఠశాల యజమాని కూరగాయలను అమ్ముతూ త్వరలోనే పాఠశాలలో రీ ఓపెన్ చేయాలని రోడ్డుపై నిరసన తెలియజేశారు.
సెయింట్ సాయి పాఠశాల యాజమానితో పాటు, టీచర్లు కూడా సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ టీచర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్కూల్ యాజమాన్యం చేస్తున్న నిరసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.