ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే. ఒకరు మంచి పని చేసినా, ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్నా ఎందుకో ఎక్కడలేని అసూయ, ఈర్ష్య ద్వేషాలు కలుగుతాయి. ఎన్‌టీవీ వ్యవస్థాపకులు తుమ్మల నరేంద్ర చౌదరి మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు. అలాంటి ఆయనపై బురదజల్లే ప్రయత్న చేస్తున్నారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులను దౌర్జన్యంగా బనాయించి ఆయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానంగా ఓ స్కాం లో ఆయన పేరు ఎక్కువగా వినబడుతోంది. అదే జూబ్లీ హిల్స్ స్కాం. ఇప్పటివరకు క్లీన్ గా ఉన్న చౌదరి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి. నిన్న మొన్నటి వరకు తుమ్మల నరేంద్ర చౌదరి అధ్యక్షతలో జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఉండేది. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టీవీ5 ప్యానెల్ గెలుపొందింది. కాగా ఈ పోటీలో తుమ్మల నరేంద్ర చౌదరి పాల్గొనలేదు. ఆయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది. గత నెల చివరి వరకు ఈ స్కాం కు సంబంధించి ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక నరేంద్ర చౌదరి మీద కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నంలో భాగంగా జరిగిన కుట్రకు పునాది అని తెలుస్తుంది.
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన టీవీ5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ బొల్లినేని.. తుమ్మల నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి.హనుమంతరావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టారు. అది కూడా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీవీ5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ బొల్లినేని ప్యానెల్ గెలిచిన తరువాత నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి.హనుమంతరావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టారు. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయిందని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఈ లావాదేవీని ఇప్పుడు స్కాం పేరుతో బయటకు తీసుకురావడం వెనుక అసలు కోణం ఆయనపై బురద చల్లడమే అని క్లియర్ గా తెలుస్తుంది.
గత అధ్యక్షుడయిన టి.నరేంద్ర చౌదరి వ్యక్తిగా, సామాజిక సంస్కర్తగా తన వ్యాపార దక్షతకు సమాజ సేవ దృక్పథం జోడించి అనేకానేక వ్యక్తి వికాస, సమాజ వికాస కార్యక్రమాల్లో తన వంతు అద్వితీయమైన కృషిని కొనసాగించారని ప్యానెల్ లోని సభ్యులు కొనియాడారు. మీడియా రంగంలో ఎన్‌టీవీ, ప్రప్రథమ తెలుగు భక్తి ప్రధాన ఛానల్ భక్తి టీవీ, మహిళా సాధికారత కోసం వనిత టీవీని స్థాపించి అనేక మందికి మార్గదర్శకులయ్యారు. ఆఖరికి ఛానళ్ల విషయంలోనూ ఆయనను కృంగదీసే ప్రయత్న చేస్తున్నారు. ఎంతో ఆధ్యాతికతను ప్రేక్షకులను పంచుతున్న భక్తి ఛానల్ ను రానివ్వకుండా, పాపులర్ కానివ్వకుండా కొంతమంది మీడియా బడా బాబులు చూస్తున్నారు. ఆ ఛానల్ గురించి చెడుగా కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కథనాలు ప్రసారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కోటిదీపోత్సవం వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు పునాది వేసిన ఓ సంఘసంస్కర్తని ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్ప కృంగిపోరు అని ఆయన్ని అభిమానించే వారు అంటున్నారు. ఆయనను దిగజార్చడానికి ప్రముఖ మీడియా సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయని ఇప్పటికే తెలుస్తుంది. వీటన్నిటికీ తుమ్మల నరేంద్ర చౌదరి సమాధానం ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…