కరోనా నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కోట్ల మందికి టీకాలను ఇచ్చారు. మే 1 నుంచి 18-44 ఏళ్ల మధ్య ఉన్నవారికి కూడా టీకాలను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కానీ చాలా రాష్ట్రాల్లో టీకాల కొరత కారణంగా టీకాల పంపిణీకి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న వారు తాము తీసుకున్న టీకా పనిచేస్తుందా, లేదా అని అనేక అనుమానాలకు గురవుతున్నారు. కానీ అలాంటి వారిలో కింద తెలిపిన లక్షణాలు కనిపిస్తే వారు తీసుకున్న టీకా పనిచేస్తున్నట్లే లెక్క అని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ టీకా తీసుకున్న వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాదాపుగా 2-3 రోజుల పాటు ఉండే ఆ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. జ్వరం ఉంటే మాత్రం పారాసిటమాల్ వేసుకోవచ్చు. అయితే కోవిడ్ టీకా తీసుకున్న వారిలో స్వల్పంగా కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, జ్వరం వంటి లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే టీకా పనిచేస్తున్నట్లే అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో టీకా తాలూకు మెడిసిన్ ప్రవేశించగానే శరీరం స్పందించి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో సహజంగానే పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఆయా లక్షణాలు కనిపిస్తే కంగారు పడాల్సిన పనిలేదని, టీకా పనిచేస్తున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే లక్షణాలు కనిపించకపోయినా కంగారు పడొద్దని, కొందరికి లక్షణాలు కనిపించవని, అయినప్పటికీ టీకా సమర్థవంతంగానే పనిచేస్తుందని చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…